This Day in History: 1895-01-12
1895 : ద మిరాకిల్ మేన్ ఆఫ్ మెడిసిన్ ఎల్లాప్రగడ సుబ్బారావు జననం. భారతీయ జీవరసాయిన శాస్త్రవేత్త, మార్గదర్శకుడు, అధ్యాపకుడు. ఆయన పేరు మీద సుబ్బరోమైసెస్ స్ప్లెండెన్స్ అనే ఫంగస్ ఉంది.
ఫోలిక్ యాసిడ్ (విటమిన్ B9) ను సంశ్లేషణ చేయడానికి ఒక పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఆయన కనిపెట్టిన హెట్రజాన్ అనే మందు ప్రపంచ ఆరోగ్య సంస్థచే బోదకాలు నివారణకు ఉపయోగించబడుతుంది. మొదటి కాన్సర్ నిరోధక ఔషధం మెథోట్రెక్సేట్ మరియు యాంటెల్మింటిక్ డ్రగ్ డైథైల్ కార్బమాజైన్ ను కనుగొన్నాడు. ఫైలేరియాసిస్‌కు వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉపయోగించే క్రిమిసంహారక డైథైల్ కార్బమాజైన్ (హెట్రాజాన్)కి ఆధారాన్ని కనుగొన్నాడు. ఆయన పర్యవేక్షణలో బెంజమిన్ డగ్గర్‌ప్లేగు వ్యాధిని అరికట్టే టెట్రాసైక్లిన్ ను కనిపెట్టాడు. సైనామిడ్ అనే అమెరికన్ రసాయన తయారీ సంస్థ సుబ్బారావ్ గౌరవార్థం ఒక కొత్త ఫంగస్‌కు సుబ్బరోమైసెస్ స్ప్లెండెన్స్ అని పేరు పెట్టింది. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఖద్దరు మాత్రమే ధరించాడు. దీనికి డిగ్రీ పెట్టా దక్కలేదు.
