- దినోత్సవం
జాతీయ గ్రంథాలయ వారోత్సవం - నాల్గవ రోజు (ఇండియా)
ప్రపంచ ముందస్తు జననాలపై అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
అమరవీరుల దినోత్సవం (ఒడిశా)
- జననం
1900 : పద్మ విభూషణ్ ముత్యాల పద్మజా నాయుడు జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ గవర్నర్. హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ సహ స్థాపకురాలు. సరోజినీ నాయుడు, గోవిందరాజులు నాయుడుల కుమార్తె.
1906 : సోయిచిరో హోండా జననం. జపనీస్ ఇంజనీర్, పారిశ్రామికవేత్త. హోండా మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు.
1920 : పద్మశ్రీ జెమినీ గణేషన్ (గణపతి సుబ్రమణియన్ శర్మ) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. 'రామసామి గణేషన్' గా పేరు మార్చుకున్నాడు. కాదల్ మన్నన్ బిరుదు పొందాడు. సినీ నటులు సావిత్రి, పుష్పవల్లి లను వివాహం చేసుకున్నాడు.
1961 : పద్మ భూషణ్ చందా కొచ్చర్ (చందా అద్వానీ) జననం. భరతీయ వ్యాపారవేత్త. ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించింది.
1972 : రోజా (శ్రీలతా రెడ్డి) జననం. భారతీయ సినీ నటి, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు గ్రహీత. తమిళ సినీ దర్శకుడు సెల్వమణి ను వివాహం చేసుకుంది.
1982 : యూసుఫ్ పఠాన్ జననం. భారతీయ మాజీ క్రికెటర్. పఠాన్ 2001/02 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్ మరియు రైట్ హ్యాండ్ ఆఫ్బ్రేక్ బౌలర్. ఆయన తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ కూడా భారత క్రికెటర్. ఐపిఎల్ లో 2వ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వాడిగా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్లో 16 సార్లు (3వ ర్యాంక్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన భారత క్రికెటర్గా నిలిచాడు.
1995 : అఖిల్ సార్థక్ జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ యాంకర్. ఆయన తెలుగు టీవి సిరీస్ కల్యాణి లో 'కార్తీక్' పాత్రను పోషించినందుకు బాగా పేరు పొందాడు. 2020లో రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు 4” లో కంటెస్టెంట్గా కనిపించాడు. హైదరాబాద్ టైమ్స్ టీవి మోస్ట్ డిజైరబుల్ మెన్ గా 3వ స్థానంలో నిలిచాడు.
- మరణం
1928 : పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు, రచయిత, రాజకీయవేత్త. లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకడు. సైమన్ కమిషన్ వ్యతిరేకించాడు. 'హిందూ అనాథ రిలీఫ్ మూవ్మెంట్' వ్యవస్థాపకుడు. లాహోర్ ఆధారిత ఆర్య గెజెట్ వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు.
1971 : పద్మశ్రీ దేబకీ కుమార్ బోస్ మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. 'డెబాకె ప్రొడక్షన్స్' నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.
2012 : హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ (బాల్ కేశవ్ ఠాక్రే) మరణం. భరతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, కార్టూనిస్ట్. 'శివసేన' రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. యునైటెడ్ మహారాష్ట్ర నుండి మరాఠీ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిండు. 'సామ్నా' పత్రిక స్థాపించాడు. 1993 ముంబై అల్లర్లలో ఈ పత్రిక హింసను ప్రేరేపించింది.
2015 : హిందూ హృదయ్ సామ్రాట్ అశోక్ సింఘాల్ మరణం. భారతీయ హిందూ జాతీయవాది, గాయకుడు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆర్ఎస్ఎస్ సభ్యుడు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమానికి ఇన్ఛార్జ్. హిందుస్తానీ సంగీతంలో శిక్షణ పొందిన గాయకుడు. ధర్మశ్రీ పురస్కారం లభించింది.
2018 : పద్మశ్రీ అలిక్ పదంసీ మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, యాడ్ ఫిల్మ్ నిర్మాత. భారత్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ 'లింటాస్' సియిఓ. ‘గాంధీ’ సినిమాలో మహమ్మద్ అలీ జిన్నా పాత్రలో ప్రసిద్ధి చెందాడు. తెలుగు సినీనటి షాజన్ పదంసీ ఈయన కుమార్తె.
చరిత్ర కొనసాగుతుంది..