1962 : మేజర్ షైతాన్ సింగ్ భాటి మరణం. భారతీయ ఆర్మీ అధికారి. పరమ వీర చక్ర గ్రహీత. భారత్ చైనా యుద్ధ సమయంలో తెల్లవారుజామున చైనీయులు వెనక నుండి దాడి చేయడంతో ఎలాంటి కవరింగ్ లేకుండా యుద్దంలోకి వెళ్ళి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు.
1978 : పద్మ భూషణ్ ధీరేన్ గంగూలీ (ధీరేంద్ర నాథ్ గంగూలీ) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 'ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ', 'బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్', 'లోటస్ ఫిల్మ్ కంపెనీ' నిర్మాణ సంస్థల వ్యవస్థాపకుడు.
2020 : పద్మశ్రీ మృదుల సిన్హా మరణం. భారతీయ రచయిత్రి, అధ్యాపకురాలు, రాజకీయవేత్త, విద్యావేత్త. గోవా 17వ గవర్నర్. గోవా గవర్నర్ గా పదవి పొందిన మొదటి మహిళ.