1882 : భారతరత్న బి సి రాయ్ (బిధాన్ చంద్ర రాయ్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, పరోపకారి, వైద్యుడు, రాజనీతజ్ఞడు. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి.
1921 : పద్మ విభూషణ్ అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ జననం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, రాజకీయవేత్త. బీహార్ 10వ గవర్నర్. పశ్చిమ బెంగాల్ 15వ గవర్నర్. హర్యానా 13వ గవర్నర్.
1949 : పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడు (ముప్పవరపు వెంకయ్య నాయుడు) జననం. భరతీయ రాజకీయవేత్త. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొదటి భారతీయ ఉపరాష్ట్రపతి. బిజెపి అధ్యక్షుడు.
1995 : మిస్ ఇండియా తమిళనాడు శివాని రాజశేఖర్ (శివాని పిళ్లై) జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. సినీ నటులు రాజశేఖర్, జీవితాల కుమార్తె.