1956-09-01 – On This Day  

This Day in History: 1956-09-01

ఎల్ ఐ సి దినోత్సవం (ఇండియా) అనేది ఏటా సెప్టెంబర్ 1న జరుపుకొనే వార్షిక ఆచారం. భారత జీవిత బీమా సంస్థ లేదా లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారత ప్రభుత్వ బీమా, పెట్టుబడి సంస్థకు 1956, సెప్టెంబరు 1 న బీమా రంగాన్ని జాతీయం చేయడం కోసం పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు అంకురార్పణ జరిగింది. సుమారు 245 బీమా సంస్థలు, ప్రావిడెంట్ సంస్థలను కలిసి లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా ఏర్పడింది. ఈరోజు ను LIC లో అందరూ దినోత్సవంగా జరుపుకుంటారు.