1936 : పద్మ భూషణ్ సత్యదేవ్ దూబే జననం. భారతీయ నాటక దర్శకుడు, రచయిత, సినీ నటుడు, సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజెంటర్.
1941 : పద్మశ్రీ సునీతా జైన్ జననం. భారతీయ పండితురాలు, నవలా రచయిత్రి, చిన్న కథా రచయిత్రి, సాహిత్యాల కవయిత్రి. ఆంగ్ల మరియు హిందీ సాహిత్యాల కవయిత్రి, ప్రొఫెసర్.
1942 : హారిసన్ ఫోర్డ్ జననం. అమెరికన్ సినీ నటుడు, పైలట్, పర్యావరణ కార్యకర్త. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ప్రారంభ వైస్ చైర్.
1987 : మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసాబ్ జననం. పాకిస్తానీ మిలిటెంట్, లష్కర్-ఎ-తైబా ఇస్లామిక్ తీవ్రవాది. 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో 166 మందిని చంపిన సమూహంలో సజీవంగా దొరికిన ఏకైక సభ్యుడు.