1890 : హెన్రీ నెస్లే (హెన్రిచ్ నెస్లే) మరణం. జర్మన్-స్విస్ మిఠాయి వ్యాపారవేత్త, వ్యవస్థాపకడు. 'నెస్లే' ఆహార సంస్థ వ్యవస్థాపకుడు.
2008 : కీర్తిచక్ర వి వి రావ్ (వాడపల్లి వెంకటేశ్వరరావు) మరణం. భారతీయ దౌత్యవేత్త. కీర్తిచక్ర పురస్కారం పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు.
2014 : పద్మశ్రీ మదన్ లాల్ మధు మరణం. భారతీయ కవి, రచయిత, అనువాదకుడు. హిందీ భాషలో రష్యన్ క్లాసిక్స్ అనువాదాలకు ప్రసిద్ధి చెందాడు. హిందుస్తానీ సమాజ్ స్థాపకులలో ఒకడు.
2021 : పద్మ విభూషణ్ దిలీప్ కుమార్ (మహమ్మద్ యూసుఫ్ ఖాన్) మరణం. పాకిస్తానీ భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.