- దినోత్సవం
ఓల్డ్ రాక్ దినోత్సవం
వన మహోత్సవ్ - ఏడవ రోజు (ఇండియా)
సోలమన్ ఐలాండ్స్ స్వాతంత్ర్య దినోత్సవం (యునైటెడ్ కింగ్‌డమ్ నుండి)
ప్రపంచ క్షమాపణ దినోత్సవం
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవం
- సంఘటనలు
1896 : భారతదేశంలోని బొంబాయి వాట్సన్ హోటల్‌లో లూమియర్ సోదరులు మొట్టమొదటిసారిగా ఒక రూపాయి టికెట్ ధరతో చలనచిత్రాన్ని ప్రదర్శించారు. ఆ రోజు ప్రదర్శింపబడిన ఆరు సినిమాలు ఎంట్రీ ఆఫ్ సినిమాటోగ్రాఫ్ , ది సీ బాత్ , అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ , ఎ డిమోలిషన్ , లేడీస్ అండ్ సోల్జర్స్ ఆన్ వీల్స్ అండ్ లీవింగ్ ది ఫ్యాక్టరీ. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సంఘటనను "శతాబ్దపు అద్భుతం"గా పేర్కొంది.
1994 : భారతదేశంలోని తెలంగాణలో 'మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి' (MRPS) సంస్థ స్థాపించబడింది.
1995 : భారతదేశంలో టెలికమ్యూనికేషన్ సేవల సంస్థ 'భారతి ఎయిర్‌టెల్' స్థాపించబడింది.
2004 : హర్యానా 13వ గవర్నర్ గా అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
- జననం
1854 : మౌలానా బర్కతుల్లా భోపాలి (అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బర్కతుల్లా) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పూర్వ భారతదేశ మొదటి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి.
1914 : కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, రాజకీయ కార్యకర్త. ప్రజా నాట్య మండలి నాటక బృందం వ్యవస్థాపకుడు.
1922 : పద్మశ్రీ పద్మనాభ పిళ్లై గోపీనాథన్ నాయర్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, గాంధేయవాది. జమ్నాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత. మహాత్మా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్.
1958 : వడివుక్కరసి జననం. భరతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.
1965 : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ (దరువు ఎల్లయ్య) జననం. భారతీయ సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. 'మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి' (MRPS) సంఘ వ్యవస్థాపకుడు. మహాజన సోషలిస్ట్ పార్టీ (MSP) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. వికలాంగుల హక్కుల ఉద్యమం, గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత వైద్యం కోసం ఉద్యమం, లాంటి ఉద్యమాలు చేశాడు. 1994 లో తన ఇంటిపేరు ను మాదిగ గా మార్చుకున్నాడు.
1981 : పద్మ భూషణ్ మహేంద్ర సింగ్ ధోని జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత.
- మరణం
1890 : హెన్రీ నెస్లే (హెన్రిచ్ నెస్లే) మరణం. జర్మన్-స్విస్ మిఠాయి వ్యాపారవేత్త, వ్యవస్థాపకడు. 'నెస్లే' ఆహార సంస్థ వ్యవస్థాపకుడు.
2008 : కీర్తిచక్ర వి వి రావ్ (వాడపల్లి వెంకటేశ్వరరావు) మరణం. భారతీయ దౌత్యవేత్త. కీర్తిచక్ర పురస్కారం పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు.
2014 : పద్మశ్రీ మదన్ లాల్ మధు మరణం. భారతీయ కవి, రచయిత, అనువాదకుడు. హిందీ భాషలో రష్యన్ క్లాసిక్స్ అనువాదాలకు ప్రసిద్ధి చెందాడు. హిందుస్తానీ సమాజ్ స్థాపకులలో ఒకడు.
2021 : పద్మ విభూషణ్ దిలీప్ కుమార్ (మహమ్మద్ యూసుఫ్ ఖాన్) మరణం. పాకిస్తానీ భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
చరిత్ర కొనసాగుతుంది..