Yesterday – On This Day  

Yesterday

Under Working

1803 : ప్రపంచంలోని మొట్ట మొదటి పబ్లిక్ రైల్వే సర్రే ఐరన్ రైల్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని దక్షిణ లండన్ లో ప్రారంభమైంది.

దినోత్సవం

liberia flagలైబీరియా స్వాతంత్ర్య దినోత్సవం (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి)

Esperanto flag world Esperanto dayప్రపంచ ఎస్పెరాంటో భాషా దినోత్సవం

maldives flagమాల్దీవులు స్వాతంత్ర్య దినోత్సవం (యునైటెడ్ కింగ్‌డమ్ నుండి)

kargil victory dayకార్గిల్ విజయ దినోత్సవం (ఇండియా)

International Day for the Conservation of the Mangrove Ecosystemమడ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం

సంఘటనలు

first woman cricket1745 : ఇంగ్లాండ్‌లోని గిల్డ్‌ఫోర్డ్ సమీపంలో బ్రాంలీ మరియు హాంబుల్డన్ గ్రామాల మధ్య మొట్టమొదటిసారిగా మహిళల క్రికెట్ మ్యాచ్ జరిగింది.

Dadabhai Naoroji Dordi Grand Old Man of India1892 : బ్రిటన్ లో లిబరల్ పార్టీ తరపున మొదటి ఏషియన్ పార్లమెంటు సభ్యుడిగా భారతీయ సంతతికి చెందిన దాదాభాయ్ నౌరోజీ ఎన్నికయ్యాడు.

sattelite1963 : నాసా యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటి జియోసింక్రోనస్ ఉపగ్రహం 'సింకామ్ 2' ప్రయోగించబడింది.

kargil victory1999 : ఇండియా పాకిస్థాన్ మధ్య కార్గిల్ వివాదం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులు పూర్తిగా వెనుతిరిగినట్టు భారత సైన్యం ప్రకటించింది.

2005 : ముంబైలో 24 గంటల్లో 99.5 సెం.మీ వర్షం కురిసింది, ఫలితంగా వరదలు వచ్చి 5,000 మందికి పైగా మరణించారు.

2016 : మొట్టమొదటి సౌరశక్తి తో ఎగిరే విమానం సోలార్ ఇంపల్స్ 2 ప్రపంచాన్ని చుట్టి వచ్చింది.

జననం

Krishnarao Shankar Pandit1893 : పద్మ భూషణ్ కృష్ణారావు శంకర్ పండిట్ జననం. భారతీయ సంగీత విద్వాంసుడు, రచయిత. 'శంకర్ గంధర్వ మహావిద్యాలయ' వ్యవస్థాపకుడు. గ్వాలియర్ ఘరానా ప్రముఖ గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

1904 : అమెరికన్ పారిశ్రామికవేత్త మరియు వ్యవస్థాపకుడు, ఫ్లైట్ సిమ్యులేటర్‌ ("బ్లూ బాక్స్" లేదా "లింక్ ట్రైనర్") ను కనుగొన్న ఎడ్విన్ ఆల్బర్ట్ లింక్ జననం

1927 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన గులాబ్‌రాయ్ రాంచంద్ (గులాబ్రాయ్ సిపాహిమలని "రామ్" రామ్‌చంద్) జననం

1930 : డాక్టర్ అన్నా సారా కుగ్లర్ మరణం. అమెరికా వైద్య మిషనరీ. భారతదేశంలో 47 ఏళ్లు వైద్య సేవలందించింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఆసుపత్రిని స్థాపించింది. ఆసుపత్రికి ఆమె పేరు పెట్టారు.

1967 : ఆంగ్ల నటుడు, నిర్మాత, మార్షల్ ఆర్టిస్ట్ మరియు మాజీ డైవర్ జాసన్ స్టాథమ్ జననం

1973 : పెర్ల్ హార్బర్, అండర్ వరల్డ్, వాన్ హెల్సింగ్ మరియు క్లిక్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లీష్ నటి కేట్ బెకిన్సేల్ జననం

abhirami
Divya Gopikumar1981 : అభిరామి (దివ్య గోపికుమార్) జననం. భరతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.

Mahika Sharma1994 : మిస్ టీన్ నార్త్ఈస్ట్ మహికా శర్మ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, మోడల్, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. 'మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యుమానిటీ' అందాల పోటీలో టాప్ 10లో చేరిన మొదటి భారతీయురాలు.

మరణం

Satya Narayan Sinha1983 : సత్య నారాయణ్ సిన్హా మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 4వ గవర్నర్. సామాన్యులకు రాజ్‌భవన్‌ గేట్లు తెరిచిన తొలి గవర్నర్‌. లోక్‌సభలో ప్రధానమంత్రి కాలేకపోయిన మొదటి సభా నాయకుడు.

2015 : భారత న్యాయవాది, రాజకీయవేత్త, భారత గనుల మంత్రి, 15 వ లోక్సభ సభ్యుడు, ప్రఖ్యాత ఇండోలాజిస్ట్ కృష్ణ కాంత హండిక్ యొక్క ఏకైక కుమారుడు బిజోయ్ కృష్ణ హండిక్ మరణం

చరిత్ర కొనసాగుతుంది..