Tomorrow – On This Day  

Tomorrow

దినోత్సవం

World Nature Conservation Dayప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

peru flag
పెరు స్వాతంత్ర్య దినోత్సవం (స్పెయిన్ నుండి)

World Hepatitis Dayప్రపంచ హెపటైటిస్ దినోత్సవం

సంఘటనలు

1896 : మయామి నగరం ఫ్లోరిడాలో విలీనం చేయబడింది.

ikea1943 : స్వీడన్ లో ఐకియా (IKEA) కంపెనీ స్థాపించబడింది.

Chaudhary Charan Singh1979 : భారతదేశ 5వ ప్రధానమంత్రిగా చౌదరి చరణ్ సింగ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1979 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి మొరార్జీ దేశాయ్ పదవి విరమణ చేశాడు.

2001 : ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్ సమావేశంలో ఇయాన్ తోర్పే ఆరు బంగారు పతకాలు సాధించి తొలి ఆస్ట్రేలియా ఈతగాడు అయ్యాడు.

2010 : పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు ఉత్తరాన ఉన్న మార్గల్లా హిల్స్‌లో ఎయిర్‌బ్లూ ఫ్లైట్ 202 కూలిపోయి విమానంలో ఉన్న 152 మంది మృతి చెందారు. ఇది పాకిస్తాన్ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం.

2021 : కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ సోమప్ప బొమ్మాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

జననం

1907 : అమెరికన్ వ్యాపారవేత్త మరియు ఆవిష్కర్త, ఆహారాన్ని నిల్వ చేయడానికి గాలి చొరబడని ప్లాస్టిక్ బాక్స్ యొక్క ఆవిష్కర్త, టప్పర్‌వేర్ ప్లాస్టిక్స్ కంపెనీ స్థాపించిన ఎర్ల్ సిలాస్ టప్పర్ జననం

1909 : కాసు బ్రహ్మానందరెడ్డి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రి. మహారాష్ట్ర 14వ గవర్నర్.

1921 : చక్కెర కళాప్రపూర్ణ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, రాజకీయవేత్త. ఆంధ్రా షుగర్స్ స్థాపించాడు.

Pasupuleti Venkata Bangarraju Krishna Vamsi1962 : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (పసుపులేటి వెంకట బంగారు రాజు) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, కొరియోగ్రాఫర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. 'ఆంధ్రా టాకీస్' నిర్మాణ సంస్థ స్థాపకుడు.

Ayesha Jhulka 1972 : ఆయేషా ఝుల్క జననం. భారతీయ సినీ నటి, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్.

Venkatesh Prabhu Kasthuri Raja
dhanush
danush
1983 : ధనుష్ (వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా) జననం. భరతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.

dulquer salmaan1986 : దుల్కర్ సల్మాన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, పంపిణీదారు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాపారవేత్త. సినీ నటుడు మమ్ముట్టి కుమారుడు.

మరణం

1946 : కాథలిక్ చర్చ్ చేత సెయింట్ గా కాననైజ్ చేయబడిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళ సెయింట్ అల్ఫోన్సా (అన్నా ముత్తతుపదతు) మరణం

1972 : నక్సలైటు నాయకుడు, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి, సిపిఐ పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి చారు మజుందార్ మరణం

2004 : బ్రిటిష్ మాలిక్యులర్ బయాలజిస్ట్, బయోఫిజిసిస్ట్ మరియు న్యూరో సైంటిస్ట్, నోబిల్ బహుమతి గ్రహీత, జేమ్స్ వాట్సన్ మరియు రోసలిండ్ ఫ్రాంక్లిన్ తో కలిసి DNA అణువు యొక్క హెలికల్ నిర్మాణాన్ని అర్థంచేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఫ్రాన్సిస్ హ్యారీ కాంప్టన్ క్రిక్ మరణం

2006 : పద్మ భూషణ్ ఫుల్రేణు గుహ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విద్యావేత్త, రాజకీయవేత్త. కర్మ కుటీర్ వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు.

leela naidu
leela nayudu2009 : మిస్ ఇండియా లీలా నాయుడు మరణం. భరతీయ సినీ నటి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 1954 టైటిల్ విజేత. అమెరికా ఫ్యాషన్ మ్యాగజైన్ 'వోగ్' ద్వారా ప్రపంచంలో పదిమంది అందమైన మహిళలలో ఒకరు.

2019 : రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి మరణం

2021 : ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచిన ఆటగాడు, అంతర్జాతీయ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు, అర్జున అవార్డును అందుకున్న మొదటి క్రీడాకారుడు, 100 కు పైగా జాతీయ మరియు అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకున్న మాజీ బ్యాడ్మింటన్, నాటేకర్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ డైరెక్టర్ నందు మహాదేవ్ నాటేకర్ మరణం

చరిత్ర కొనసాగుతుంది..