This Day in History: 2006-10-09

2006 : బహుజన్ నాయక్ కాన్షీ రామ్ మరణం. భారతీయ సంఘ సంస్కర్త, రచయిత, రాజకీయవేత్త. ‘బహుజన సమాజ్ పార్టీ’ (BSP) వ్యవస్థాపకుడు. ‘ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF)’ వ్యవస్థాపకుడు. ‘దళిత శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి’ వ్యవస్థాపకుడు. ‘బహుజన వాలంటీర్ ఫోర్స్’ వ్యవస్థాపకుడు. బహుజన్ నాయక్, మాన్యవర్, సాహెబ్ మారుపేర్లు కలవు. భారతదేశంలోని కుల వ్యవస్థలో దిగువన ఉన్న అంటరాని సమూహాలతో సహా బహుజనులు, వెనుకబడిన లేదా దిగువ కులాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశాడు.