1955-03-11 – On This Day  

This Day in History: 1955-03-11

alexander fleming1955 : సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం. స్కాట్లాండ్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. పెన్సిలిన్ కనుగొన్నాడు. 1923 లో కనుగొన్న ఎంజైములు, లైసోజైములు, 1928 లో కనుగొన్న ప్రపంచ మొట్ట మొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఆయన పరిశోధనల్లో ముఖ్యమైనవి. పెన్సిలిన్ కనుగొన్నందుకు ఆయన 1945లో హోవర్డ్ ఫ్లోరే, ఎర్నెస్ట్ బోరిస్ చైన్ లతో కలిసి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, కీమోథెరపీ మీద అనేక వ్యాసాలు రాశాడు. ఫ్లెమింగ్ కు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండు హంటేరియన్ ప్రొఫెసర్ హోదాను ఇచ్చింది. 1944 లో జార్జి VI మహారాజు నైట్ బాచెలర్ మెడల్ ను ఫ్లెమింగ్ కు బహుకరించాడు. 1999 లో టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మంది ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది. 2002 లో ఫ్లెమింగ్ ను బి.బి.సి. 100 మంది ప్రముఖ బ్రిటిష్ వ్యక్తులలో ఒకడిగా ఎన్నిక ద్వారా నిర్ణయించింది.