5114-04-17 – On This Day  

This Day in History: 5114-04-17

శ్రీరామ నవమి అనేది హిందూ కాలమానం ప్రకారం ప్రతీ ఏడాది చైత్రమాసంలో అమావాస్య తర్వాత 9వ రోజున జరుపుకొనే హిందువుల పండుగ. రాముడు త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో జన్మించాడని భావిస్తారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో ఇదే రోజున పట్టాభిషేకం జరిగిందని భావిస్తారు. సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని భావిస్తారు. జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా రాముడు క్రీస్తు పూర్వం శాలివాహన శకం 5114, జనవరి 10న జన్మించాడు.