This Day in History: 1928-10-01
1928 : పద్మ భూషణ్ శివాజీ గణేశన్ (విల్లుపురం చిన్నయ్య మన్రయార్ గణేశమూర్తి) జననం. భారతీయ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత. దాదాఫాల్కే అవార్డు గ్రహీత. నడిగర్ తిలగం బిరుదు పొందాడు. ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. సినీ నటుడు ప్రభు ఈయన కుమారుడు. కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్, చెవలియర్, దాదా సాహెబ్ ఫాల్కే, ఎన్టీఆర్ నేషనల్, నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ఆఫ్ ఫ్రాన్స్ ఆఫ్ షెవాలియర్, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నాడు.