- దినోత్సవం
అంతర్జాతీయ లెస్బియన్ దృశ్యమానత వారోత్సవం
ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం
అంతర్జాతీయ లెస్బియన్ దృశ్యమానత దినోత్సవం
అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు జ్ఞాపకార్థ దినోత్సవం
- సంఘటనలు
1917 : ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించబడినది.
1986 : ఉక్రేనియన్ లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రియాక్టర్ 4లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదం సంభవించింది.
2012 : ఇస్రో యొక్క భారతదేశ మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం (RISAT 1) ప్రయోగించింది.
2014 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి పళనిసామి సదాశివం పదవి విరమణ చేశాడు.
- జననం
1908 : ఎస్ ఎం సిక్రీ (సర్వ్ మిత్ర సిక్రి) జననం. పాకిస్తానీ భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 13వ ప్రధాన న్యాయమూర్తి.
1963 : జెట్ లి (లి లియాంజీ) జననం. చైనీస్ వుషు క్రీడాకారుడు, సినీ నటుడు, నిర్మాత, మార్షల్ ఆర్టిస్ట్, పరోపకారి. ది వన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. నేషనల్ వుషు ఛాంపియన్ టైటిల్ను 5 సార్లు గెలుచుకున్నాడు.
1970 : శరణ్య పొన్వన్నన్ (షీలా క్రిస్టినా) జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, ఫ్యాషన్ డిజైనర్, మోడల్.
1973 : సముద్రఖని జననం. భారతీయ సిని నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్.
- మరణం
1879 : ఎడ్వర్డ్-లియోన్ స్కాట్ డి మార్టిన్విల్లే మరణం. ఫ్రెంచ్ ఆవిష్కర్త. ఫ్రాన్స్లో పేటెంట్ పొందిన మొట్టమొదటి సౌండ్ రికార్డింగ్ పరికరం 'ఫోనాటోగ్రాఫ్' ను కనుగొన్నాడు.
1920 : శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకడు. కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు.
చరిత్ర కొనసాగుతుంది..