1915-10-10 – On This Day  

This Day in History: 1915-10-10

1915 : పద్మ విభూషణ్ సర్దారిలాల్ మాత్రదాస్ నంద జననం. భారతీయ నావికాదళ అడ్మిరల్.  విశిష్ట సేవ మెడల్, అతి విశిస్ట సేవ మెడల్ గ్రహీత. భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కమాండర్లలో ఒకడు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI) ఛైర్మన్. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ రెండింటిలోనూ నౌకాదళ దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలుచేసి భారతదేశం అఖండ విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు. చార్లెస్ మారు పేరు కలదు. 1 మార్చి 1970 నుండి 28 ఫిబ్రవరి 1973 వరకు నావల్ స్టాఫ్ యొక్క 7వ చీఫ్‌గా పనిచేశాడు. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ రెండింటిలోనూ నౌకాదళ దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలుచేసి భారతదేశం అఖండ విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు. అందుకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.  మే 1974 లో భారతదేశంలోని అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI)కి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా నియమితుడయ్యాడు. అనేక పదవులు నిర్వహించాడు. విశిష్ట సేవ మెడల్, అతి విశిస్ట సేవ మెడల్ తో పాటు అనేక పురస్కారాలు పొందాడు.