1900-11-17 – On This Day  

This Day in History: 1900-11-17

1900 : పద్మ విభూషణ్ ముత్యాల పద్మజా నాయుడు జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ గవర్నర్‌. హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్‌ సహ స్థాపకురాలు. సరోజినీ నాయుడు, గోవిందరాజులు నాయుడుల కుమార్తె. 1942లో ” క్విట్ ఇండియా ” ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలైంది. స్వాతంత్ర్యం తర్వాత, ఆమె 1950లో భారత పార్లమెంటుకు ఎన్నికయింది. ఇండియన్ రెడ్‌క్రాస్ అధ్యక్షురాలిగా ఉంది. పాకిస్థాన్ వ్యవస్థాపకడు మహమ్మద్ అలీ జిన్నా భార్య రుట్టి పేటిటీ కి సన్నిహిత స్నేహితురాలు. జవహర్ లాల్ నెహ్రూ ప్రపోజ్ చేస్తాడని ఆశించి ఆమె వివాహం చేసుకోలేదు. కానీ నెహ్రూ పద్మజ చాలా సంవత్సరాలు కలసి జీవించారని చెపుతారు. డార్జిలింగ్‌లోని పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్‌కి ఆమె పేరు పెట్టారు.