2015-02-18 – On This Day  

This Day in History: 2015-02-18

2015 : పద్మ భూషణ్ దగ్గుబాటి రామానాయుడు మరణం. భారతీయ సినీ నిర్మాత, నటుడు, రాజకీయవేత్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘సురేష్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.

ఆయన సంపాదన లో కొంత బాగాన్ని “రామానాయుడు ఛారిటబుల్ ట్రస్ట్” క్రింద అనేక దాతృత్వ ప్రయోజనాలకు అందించాడు. ఆయన 13 భారతీయ భాషలలో 150 కంటే ఎక్కువ చిత్రాలతో అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. 1999 నుండి 2004 వరకు 13 వ లోక్‌సభలో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేశాడు.

నేషనల్ ఫిల్మ్ అవార్డు, నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవరడు, పద్మ భూషణ్, గౌరవ డాక్టరేట్  లాంటి అనేక పురస్కారాలు పొందాడు.