1926-11-23 – On This Day  

This Day in History: 1926-11-23

1926 : పుట్టపర్తి సత్యసాయి బాబా (రత్నాకరం సత్యనారాయణ రాజు) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వేదాంతి, పరోపకారి, సంఘ సంస్కర్త. షిరిడీ సాయిబాబా పునర్జన్మగా చెప్పుకున్నాడు. ‘శ్రీ సత్య సాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్’ వ్యవస్థాపకుడు. నోట్లోంచి లోహాలు తీయడంపై అభియోగాలు ఉన్నాయి. ముంబై లో ‘సత్యం’, హైదరాబాద్ లో ‘శివం’, చెన్నై లో ‘సుందరం’ అనే మూడు మందిరాలను స్థాపించాడు. ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, తాగునీటి ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, ఆడిటోరియంలు, ఆశ్రమాలు, పాఠశాలలు లాంటి నెట్‌వర్క్‌ను స్థాపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మీద 166 దేశాలలో 10,000 పైగా సత్యసాయి సేవా సంస్థలున్నాయి.