This Day in History: 1902-06-24
1902 : జమిలి నమ్మాళ్వారు జననం. భారతీయ ప్రచురణ కర్త, రచయిత, బహుభాషావేత్త, పత్రిక సంపాదకుడు.#
ఆయనకు తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో విశేషమైన ప్రవేశం ఉంది. వాసవి అనే పక్ష పత్రికను సుమారు 10 సంవత్సరాలు నడిపాడు. గుంటూరు పత్రిక పేరుతో ఒక ద్వైవార వార్తా పత్రికను సంపాదకత్వం వహించి నిర్వహించాడు. ఆశాజ్యోతి అనే మాసపత్రికను కూడా నడిపాడు. నమ్మాళ్వార్ ప్రచురణలు పేరుతో 64 గ్రంథాలను ప్రచురించాడు. గుంటూరు పట్టణంలోని అనేక ప్రజాహిత సంస్థలతో ఇతనికి సంబంధం ఉండేది. జిల్లా పత్రికా సంపాదకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉత్తమ గ్రంథమాల పేరుతో కొన్ని మంచి పుస్తకాలను ప్రచురించాడు. స్నేహము అనే ఖండకావ్య సంపుటిని రచించాడు.