This Day in History: 2004-07-31
2004 : పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త, వైద్యుడు. అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలనపై పోరాడాడు.హాస్య నటుడిగా తెలుగు సినిమాకి చేసిన కృషికి రేలంగి తర్వాత పద్మశ్రీ పొందిన రెండవ వ్యక్తి. హోమియోపతి డాక్టర్ గా వైద్య సేవలు అందించాడు. ఆయన కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత, మనమడు అల్లు అర్జున్ సినీ నటుడిగా గుర్తింపు పొందారు. సినీ నటుడు చిరంజీవి ఆయన అల్లుడు. పాలకొల్లులో అల్లు రామలింగయ్య విగ్రహం నెలకొల్పారు. ఆయన గౌరవర్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. ఫిల్మ్ ఫేర్, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు పొందాడు.