- దినోత్సవం
జాతీయ గ్రంథాలయ వారోత్సవం - ఏడవ రోజు (ఇండియా)
ప్రపంచ బాలల దినోత్సవం
అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం
- సంఘటనలు
1923 : ఆంధ్రాబ్యాంక్ రిజిస్టర్ చేయబడింది.
1967 : హర్యానా ముఖ్యమంత్రి పదవి నుండి రాజారావు బీరేందర్ సింగ్ పదవి విరమణ చేశాడు.
1981 : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ప్రయోగాత్మక భూమి పరిశీలన కోసం భాస్కర II ఉపగ్రహన్ని ఇంటర్‌కాస్మోస్ లాంచ్ వెహికల్ ద్వారా రష్యాలోని కపుస్టిన్ యార్ నుండి ప్రయోగించింది.
1985 : మైక్రోసాఫ్ట్ సంస్థ 'విండోస్' ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ యొక్క మొదటి వెర్షన్ 'విండోస్ 1.0' ను ప్రవేశపెట్టింది.
2018 : భారతదేశంలోని 1398 మంది ఉత్తరప్రదేశ్ రైతుల యొక్క ₹. 4.05 కోట్లకు పైగా రుణాలను అమితాబ్ బచ్చన్ చెల్లించి వారికి సహాయం చేశాడు.
- జననం
1750 : టిప్పు సుల్తాన్ (ఫతే అలీ సాహబ్ టిప్పు) జననం. టిప్పు సాహబ్ లేదా మైసూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి పాలకుడు. రాకెట్ ఫిరంగిదళానికి మార్గదర్శకుడు. హైదర్ అలీ కుమారుడు. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది. కొత్త క్యాలెండర్, కొత్త నాణేలు, ఏడు కొత్త ప్రభుత్వ విభాగాలను ప్రవేశపెట్టాడు. మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాచారాలను గౌరవించాడు. శ్రీరంగపట్నం ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు. ప్రపంచంలోని మొదటి యుద్ధ రాకెట్‌ను ఆవిష్కరించిన వ్యక్తి అని అబ్దుల్ కలాం పేర్కొన్నాడు.
1925 : చుక్కా రామయ్య జననం. భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, సామాజిక ఉద్యమకారుడు. ఐఐటి రామయ్య గా ప్రసిద్ధి చెందాడు. తెలంగాణ ఉద్యమకారుడు. శాసనమండలి సభ్యుడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు.
1942 : జో బిడెన్ (జోసెఫ్ రాబినెట్ బిడెన్ జూనియర్) జననం. అమెరికన్ రాజకీయవేత్త. అమెరికా కు 46వ అధ్యక్షుడు. డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు. బరాక్ ఒబామా ఆధ్వర్యంలో 47వ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌లో డెలావేర్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం విత్ డిస్టింక్షన్ పురస్కారంతో పాటు అనేక ఇంటర్నేషనల్ పురస్కారాలు, డాక్టరేట్లు, అవార్డులు అందుకున్నాడు.
1956 : వంశీ (నల్లమిల్లి భామిరెడ్డి) జననం. భారతీయ సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, గీత రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
1979 : షాలిని జననం. భారతీయ మాజీ నటి. బేబీ షాలిని అని కూడా పిలుస్తారు. బేబీ షామిలీ, రిచర్డ్ ఋషి ల తోబుట్టువు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ని వివాహం చేసుకుంది. ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ చిత్రాలలో పని చేసింది. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.
1989 : సాయి ధన్షిక జననం. భారతీయ సినీనటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళం, కన్నడ, తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. ఆమెను మరీనా అని కూడా పిలుస్తారు. ఎడిసన్, విజయ్, ఫిల్మ్ ఫేర్, ఆనంద్ వికటన్ అవార్డులను అందుకుంది.
1989 : బబితా కుమారి ఫోగత్ జననం. భారతీయ మహిళా మల్లయోధురాలు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. అర్జున అవార్డు గ్రహీత.
1995 : ప్రియాంక మోహన్ (ప్రియాంక అరుళ్ మోహన్) జననం. భారతీయ సినీ నటి.
చరిత్ర కొనసాగుతుంది..