Tomorrow – On This Day  

Tomorrow

Under Working
1933 : మిస్ యూనివర్స్ హిల్లేవి రాంబిన్ షిన్ జననం.
దినోత్సవం

జాతీయ హిందీ దినోత్సవం (ఇండియా)

సంఘటనలు

1949 : భారతదేశం యొక్క జాతీయ భాషగా హిందీ మరియు ఇంగ్షీషు ఎంపిక చేయబడ్డాయి. రాజ్యాంగ పరిషత్తు ఒక్క ఓటుతో హిందీని భారతదేశ అధికార భాషగా నిర్ణయించింది.

1958 : పంజాబ్ గవర్నర్ పదవి నుండి చందేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్ పదవి విరమణ చేశాడు.

1960 : ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా అనే ఐదు వ్యవవస్థాపక సభ్య దేశాలచే 'ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్ష్పొర్టింగ్ కంట్రీస్' (OPEC) బాగ్దాద్‌లో స్థాపించబడింది.

జననం

1774 : లెఫ్టినెంట్ జనరల్ లార్డ్ విలియం హెన్రీ కావెండిష్ బెంటింక్ జననం. బ్రిటిష్ ఇండియా సైనికాధికారి, రాజనీతిజ్ఞుడు. భారత గవర్నర్ జనరల్‌. సతీ విధానాన్ని రద్దు చేశాడు. ఆడ శిశుహత్యను నిషేధించాడు.

1883 : గాడిచర్ల హరిసర్వోత్తమరావు జననం. భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోద్యమ నాయకుడు. 'స్వరాజ్య' తెలుగు పత్రిక వ్యవస్థాపకుడు. 'రాయలసీమ' కు పేరు పెట్టింది ఆయనే. సంపాదకుడు, భావకవిత్వం అనే తెలుగు పదాలను సృష్టించాడు.

1963 : రాబిన్ సింగ్ (రాబింద్ర రామ్‌నరైన్ సింగ్) జననం. ట్రినిడాడ్ టొబాగో-భారతీయ క్రికెటర్, కెప్టెన్, కోచ్. 'రాబిన్ సింగ్ స్పోర్ట్స్ అకాడమీ' స్థాపకుడు.

మరణం

Tarasankar Bandyopadhyay1971 : పద్మ భూషణ్ తారాశంకర్ బందోపాధ్యాయ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, వక్త, రచయిత, రాజకీయవేత్త. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

చరిత్ర కొనసాగుతుంది..