This Day in History: 1875-10-31
1875 : భారతరత్న వల్లభాయ్ పటేల్ (వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి.
సర్దార్, భారతదేశ ఉక్కుమనిషి గా పేరు పొందాడు. 562 రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేశాడు. బార్డోలీలో బ్రిటీష్ పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి అక్కడి రైతులతో సర్దార్ గా పిలవబడ్డాడు. భారతరత్న పురస్కారం లభించింది. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల పటేల్ విగ్రహాన్ని గుజరాత్ లో ప్రతిస్టించారు. ఈరోజును జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రకటించారు.