1847-10-01 – On This Day  

This Day in History: 1847-10-01

Annie Besant1847 : అన్నీ బెసెంట్ జననం. బ్రిటిష్ భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి, వక్త, రాజకీయవేత్త, విద్యావేత్త, పరోపకారి. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు. కేంద్రీయ హిందూ కళాశాల వ్యవస్థాపకురాలు. ఆల్ ఇండియా హోమ్ రూల్ ఉద్యమం స్థాపించింది. లా అండ్ రిపబ్లిక్ లీగ్ ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలు. మే యూనియన్ ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది. “హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం” అనే పుస్తకాన్ని వ్రాసింది. న్యూ ఇండియా  దినపత్రిక వ్యవస్థాపకురాలు. ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్ వ్యవస్థాపకురాలు. ” కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ “ను ఇంగ్లాండులో స్థాపించింది. మానవ స్వేచ్ఛ యొక్క ఛాంపియన్‌గా పరిగణించబడుతుంది, ఆమె ఐరిష్ మరియు భారతీయ స్వాతంత్ర్యల కొరకు పోరాడింది.  కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించినది.