1906-11-03 – On This Day  

This Day in History: 1906-11-03

1906 : పద్మ భూషణ్ పృథ్వీరాజ్ కపూర్ జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్’ (IPTA) వ్యవస్థాపక సభ్యుడు. పృథ్వీ థియేటర్స్‌ స్థాపించాడు.

ముంబైలో ట్రావెలింగ్ థియేటర్ కంపెనీగా పృథ్వీ థియేటర్స్‌ను స్థాపించాడు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ లు ఈయన కుమారులే. సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మూడవ వ్యక్తి. పద్మ భూషణ్ పురస్కారం లభించింది.