1956-12-06 – On This Day  

This Day in History: 1956-12-06

1956 : భారతరత్న బి ఆర్ అంబేద్కర్ (భీమ్‌రావ్ రామ్‌జీ సక్పాల్) మరణం. భారతీయ న్యాయవాది, అధ్యాపకుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతజ్ఞుడు. భారత రాజ్యాంగ పితామహుడు. జై భీమ్, బాబాసాహెబ్ గా గౌరవించబడ్డాడు. విదేశాల్లో ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. మహద్ సత్యాగ్రహి. ఇండియాలో పనివేళలను 14గం. నుండి 8గం.కు కుదించాడు. హిందూ మహిళల ముఖ్యమైన హక్కుల కల్పించే సమగ్ర హిందూ కోడ్ బిల్లును ఆమోదించడానికి పోరాడాడు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం కృషి చేశాడు. భీంరావ్ ఇంటి పేరు సక్పాల్ కానీ స్కూల్ లో జాయిన్ అయినపుడు అంబావదేకర్ గా నమోదు చేయించారు. అనుచరులతో సహ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ‘ది గ్రేటెస్ట్ ఇండియన్’ పోల్ మొదటి స్థానంలో నిలిచాడు. కొలంబియా యూనివర్శిటీలో అంబేద్కర్ ఆత్మకథ ఒక పాఠ్య పుస్తకం. అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు లభించాయి.

Share