2023-09-28 – On This Day  

This Day in History: 2023-09-28

Mankombu Sambasivan Swaminathan ms2023 : భారతరత్న ఎం ఎస్ స్వామినాధన్ (మంకొంబు సాంబశివన్ స్వామినాథన్) మరణం. భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, మొక్కల జన్యు శాస్త్రవేత్త, మానవతావాది. భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ‘MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) డైరెక్టర్.  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)కి స్వతంత్ర ఛైర్మన్‌. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (IUCN) అధ్యక్షుడు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్-ఇండియా అధ్యక్షుడు. సుందర్‌బన్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌పై భారతదేశం – బంగ్లాదేశ్ జాయింట్ ప్రాజెక్ట్ కోసం రీజినల్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌. పద్మ విభూషణ్, రామన్ మెగసెసే, శాంతి స్వరూప్ భట్నాగర్ లాంటి అనేక అంతర్జాతీయ మరియు జాతీయ అవార్డులు మరియు గౌరవాలను గెలుచుకున్నాడు.