This Day in History: 1908-08-11
షహీద్
ఖుదీరామ్ బోస్ 🔴
మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.
18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు మరియు అతి పిన్న వయస్కుడు.
బాల్యం నుంచే స్వదేశీ ఉద్యమం, వందేమాతరం ఉద్యమం ప్రభావం చూపి, 15 ఏళ్లకే రహస్య విప్లవ సంస్థ ‘అనుషీలన్ సమితి’లో చేరాడు.
తన సహచరుడు ప్రఫుల్ల తో కలసి ముజఫర్పూర్ బ్రిటిష్ న్యాయమూర్తి డగ్లస్ కింగ్స్ఫోర్డ్ హత్య కుట్రలో పాల్గొన్నాడు.
ఆగస్ట్ 11, 1908న ఖుదిరామ్ ఉరితీయబడిన ముజఫర్పూర్ జైలు పేరు ఖుదీరామ్ బోస్ మెమోరియల్ సెంట్రల్ జైలుగా మార్చబడింది.
ఆయన గౌరవార్ధం ఖుదీరామ్ బోస్ సెంట్రల్ కాలేజీ కోల్కతా, పశ్చిమ బెంగాల్లో స్థాపించబడింది.
కోల్కతాలోని గరియా సమీపంలో ఒక మెట్రో స్టేషన్కు ఆయన పేరు పెట్టారు.
మునిసిపాలిటీ పార్క్ దగ్గర బిటి రోడ్లో ఒక ఆసుపత్రికి ‘షహీద్ ఖుదీరామ్ బోస్ హాస్పిటల్’ పేరు పెట్టారు.
