This Day in History: 1827-04-11
1827 : మహాత్మా జ్యోతిబా ఫూలే (జ్యోతిరావు గోవిందరావు గోర్హే) జననం. మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, కులవ్యతిరేక సంఘ సంస్కర్త, రచయిత. గోర్హే ఇంటిపేరు పూలు అమ్మడం వల్ల ఫూలే గా మారింది. ‘దళితుడు’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. అంటరానితన నిర్మూలన, కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీలు మరియు అణగారిన కులాల ప్రజలను విద్యావంతులను చేయడంలో కృషి చేశాడు. ఆయన భార్య సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.
