This Day in History: 1910-01-30
1910 : భారతరత్న సిఎస్ (చిదంబరం సుబ్రమణ్యం) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. మహారాష్ట్ర 15వ గవర్నర్.
భారతదేశ హరిత విప్లవానికి ఎంఎస్ స్వామినాధన్, బి శివరామన్, నార్మన్ ఇ బోర్లాగ్ లతో నాంది పలికి విజయం సాధించాడు. కేంద్ర వ్యవసాయ, ఆర్థిక, రక్షణ శాఖల్లో మంత్రి. భారతరత్న, యు థాంట్ శాంతి పురస్కారాలతో పాటు అనువ్రత్, నార్మన్ బోర్లాగ్, వై బి చవాన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డులు, గ్రీన్ రివల్యూషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు లభించాయి.
