This Day in History: 1503-02-23
1503 : అన్నమయ్య (తాళ్ళపాక అన్నమాచార్య) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు, స్వరకర్త, వైష్ణవ భక్తుడు. ‘పదకవితా పితామహుడు’ బిరుదు పొందాడు. తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
