This Day in History: 2021-04-21
2021 : పద్మ విభూషణ్ వహీదుద్దీన్ ఖాన్ మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, దౌత్యవేత్త, రచయిత, విశ్లేషకుడు. సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిచువాలిటీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. ‘మౌలానా’ గా గౌరవించబడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామీయ ఆధ్యాత్మిక గురువుగానూ, ఇస్లాం శాంతివచనాల దౌత్యవేత్తగాను, ప్రపంచశాంతిని కోరే శాంతిదూతగానూ పరిగణింపబడ్డాడు. ఆయన ఉపన్యాసాలు ప్రపంచంలో పలుచోట్ల జరుగుతూనేవుంటాయి. ఉపన్యాసకుడిగా, రచయితగా, విశ్లేషకుడిగా అపార అనుభవము గలదు. అనేకసార్లు, భారతప్రభుత్వమూ ఆయన సలహాలను కోరుతూ వుంటుంది. 2021 లో భారత ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందజేసింది.
