This Day in History: 1973-12-30
1973 : పద్మశ్రీ చిత్తూరు నాగయ్య (ఉప్పలదడియం నాగయ్య శర్మ) మరణం. భారతీయ సినీ నటుడు, సంగీత స్వరకర్త, గాయకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు.
‘రేణుకా ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరు గాంచాడు. మహారాజుల దగ్గర, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గర నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి.
