1984-04-13 – On This Day  

This Day in History: 1984-04-13

1984 : సియాచెన్ హిమానీనదం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ మేఘదూత్’ అమలుచేశారు. ఈ ఆపరేషన్ సియాచెన్ ఘర్షణల్లో భాగం. ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధరంగంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్  హిమానీనదం ప్రాంతం మొత్తంపై నియంత్రణ చేకూరింది.

సియాచెన్ గ్లేసియరును నియంత్రించేందుకు 1984 ఏప్రిల్ 13 న ఆపరేషన్ మొదలుపెట్టాలని భారత సైన్యం తలపెట్టింది. ఏప్రిల్ 17 న ఆపరేషన్ మొదలుపెట్టాలన్న పాకిస్తాన్ ఆలోచన పసిగట్టిన భారత్, దానికంటే 4 రోజుల ముందే తమ ఆపరేషన్ మొదలుపెట్టాలని ఆలోచించింది. కాళిదాసు రచించిన మేఘదూతం సంస్కృత నాటకం పేరిట తమ ఆపరేషన్‌కు పేరు పెట్టారు. లెఫ్టి. జన. ప్రేంనాథ్ హూన్ ఈ ఆపరేషన్‌కు సారథ్యం వహించాడు.

Share