2006-08-06 – On This Day  

This Day in History: 2006-08-06

Esther Victoria Abraham pramila prameelaమిస్ ఇండియా
ప్రమీల 🔴
(ఎస్తేర్ విక్టోరియా అబ్రహం) మరణం.
భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, నర్తకి, ఉపాధ్యాయురాలు, మోడల్, అందాల రాణి.
భారతదేశపు మొదటి ‘మిస్ ఇండియా’ టైటిల్ విజేత. బాలీవుడ్ మొదటి మహిళ చిత్ర నిర్మాతలలో ఒకరు.

‘సిల్వర్ ప్రొడక్షన్స్’ చిత్ర నిర్మాణ సంస్థ సహ-వ్యవస్థాపకురాలు.

ముస్లిం నటుడు కుమార్ (సయ్యద్ హసన్ అలీ జైది)ని వివాహం చేసుకుంది.

వారి కుమార్తె నకి జహాన్ మిస్ ఇండియా 1967 టైటిల్ విజేత.

భారతదేశ చరిత్రలో తల్లి మరియు కూతురు ఇద్దరూ మిస్ ఇండియా అవడమనే అరుదైన ఘనతను సంపాదించారు.

 కోల్‌కతాలో బాగ్దాదీ యూదు కుటుంబంలో జన్మించిన ఆమె, వ్యాపారవేత్త రూబెన్ ఆబ్రహం మరియు మటిల్డా ఐసాక్ (కరాచీ నుండి) కుమార్తె.

ఆమె పాకిస్తాన్‌కు గూఢచారిగా పనిచేస్తోందన్న అనుమానంతో అరెస్టు అయింది, తరవాత తన చిత్రాల ప్రచారం కోసం వెళ్ళినట్టు నిర్ధారణ అయ్యాక నిర్దోషిగా విడుదలైంది.

ప్రమీల 1947లో 31 ఏళ్ల వయసులో, తన ఐదవ సంతానంతో గర్భవతిగా ఉండగా, మొదటి మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.

ఆమె తన వృత్తిని పార్సీ థియేటర్ కంపెనీలో నర్తకిగా ప్రారంభించింది.

Share