This Day in History: 1949-04-15
1949 : బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీశాఖ, సైన్స్ & టెక్నాలజీ, సహకార మంత్రి.
తెలుగు దేశం పార్టీ లో సీనియర్ నేత. 1989-1994, 1994-1999, 1999-2004, 2009-2014 మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2003న అలిపిరి రోడ్డులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై మందుపాతర పేలిన సమయంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అదే కారులో ఉండటంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
