This Day in History: 2008-05-19
2008 : పద్మ భూషణ్ విజయ్ టెండూల్కర్ (విజయ్ ధోండోపాంట్ టెండూల్కర్) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, నాటక రచయిత, సినిమా, టివి రచయిత, వ్యాసకర్త, రాజకీయ పాత్రికేయుడు. శాంతాతా కోర్టు చాలూ ఆహే (1967), ఘాశీరాం కొత్వాల్ (1972), సఖారాం బైండర్ (1972) వంటి నాటకాలతో మంచి పేరు సంపాదించాడు. టెండూల్కర్ రాసిన అనేక నాటకాలు నిజ జీవిత సంఘటనలు లేదా సామాజిక తిరుగుబాట్ల నుండి ప్రేరణ పొందినయై, కఠినమైన వాస్తవాలపై స్పష్టమైన ధోరణిలో ఉంటాయి. అమెరికా విశ్వవిద్యాలయాలలో “నాటక రచన” కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఆయన మెళకువలను అందించాడు. టెండూల్కర్ మహారాష్ట్రలో ఐదు దశాబ్దాలపాటు అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితగా వెలుగొందాడు.
