This Day in History: 1946-06-18
గోవా విప్లవ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జూన్ 18న భారతదేశంలోని గోవా లో జరుపుకొనే ఆచారం. గోవా స్వాతంత్ర్య పోరాట చరిత్రలో 1946 జూన్ 18వ తేదీ సాయంత్రం మార్గోవోలో మరపురాని రోజు. గొప్ప జాతీయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మార్గోవ్ చేరుకుని, పోర్చుగీస్ పాలనను ధిక్కరించి స్వాతంత్ర్యం కోసం దూకుడుగా పోరాడటానికి ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగం చేశాడు.
