This Day in History: 1892-06-26
1892: అమెరికన్ నవలా రచయిత్రి పెర్ల్ ఎస్.బక్ జననం.
పెర్ల్ సెడెన్స్ట్రికర్ బక్ (జూన్ 26, 1892 – మార్చి 6, 1973), “సాయి ఝెంఝు”గా చైనా నామంతో సుపరిచితులు. (చైనా భాష: 賽珍珠; pinyin: Sài Jhēnjhū). ఈమె అమెరికన్ రచయిత, నవలా రచయిత్రి.
బాల్యము: పెర్ల్ ఎస్. బక్ తల్లి దండ్రులు పెర్ల్ కంఫర్డ్ సిడెంస్ట్రికర్ బక్ వీరు చైనాలో మత ప్రచారకులు. వారు శలవులో స్వదేశానికి వచ్చినప్పుడు అమెరికా వెస్ట్ వర్జీనియా లోని హిల్స్ బరోలో జూన్ 26, 1892 లో పుట్టింది పెర్ల్ ఎస్. బక్. కానీ బాల్యమంతా చైనాలోనే గడిపింది. ఇంగ్లీషుకన్నా ముందు చైనీస్ భాష నేర్చుకున్నది.
రచనా వ్యాసంగం: ఈమె తొలి రచన 1920 లో ప్రచురితమైంది. 1931 లో ప్రచురించి ఈమె రచన గుడ్ ఎర్త్ తో ఆమె అమెరికన్ సాహిత్యంలో అగ్ర శ్రేణి రచయిత్రిగా స్థానం సంపాదించుకుంది. ఈ నవల ఆధారంగా 1937లో ది గుడ్ ఎర్త్ అనే సినిమా తీయబడింది. ఈమె రచనలనన్నింటిలో చైనా జీవితము ముఖ్యంగా గ్రామీణ జీవితం కనబడుతుంది.
వివాహం: చైనాలోని ఆర్థిక నిపుణుడు జాన్ లాసింగ్ బక్ ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు. 1934 లో చైనాలో వచ్చిన రాజకీయ మార్పుల దృష్ట్యా, పారిపోయి స్వదేశం వచ్చ్వింది. భర్తకు విడాకులిచ్చి, ఈమె రచన గుడ్ ఎర్త్ ను ప్రచురించిన జాన్ డే ప్రచురణ సంస్థ యజమాని రిచర్డ్ జె. వాల్ష్ ను పెళ్ళి చేచుకుంది.
ఇతర రచనలు: ఈమె తన తల్లి దండ్రుల గురించి ది ఎక్స్పైల్ , ది పైటింగ్ ఏంజిల్ అనే పుస్తకాలు రచించింది. మై సెవరల్ వరల్డ్స్ అనే తన ఆత్మ కథను కూడా ప్రచురించింది. ఇంపిరియల్ వుమన్ , డ్రాగన్ సీడ్ అనే పుస్తకాలు చైనీస్ వ్వవసాయక జీవన విధానాన్ని గురించి వ్రాసింది. 1962 లో వెలువడిన ఈమె నవల సటాన్ నెవెర్ స్లీప్స్ లో చైనాలోని కమ్యూనిస్ట్ పాశవిక పరిపాలన గురించి వ్రాసింది. ఈమె తన జీవిత కాలంలో వందకు పైగా పుస్తకాలు, అనేక నవలలు, కథలు, వ్యాసాలు, విమర్శను మొదలగువాటిని ప్రచురించింది.
అవార్డులు: ఈమెకు 1935 లో విలియం డీన్ హావెల్ మెడల్ కూడ వచ్చింది., అదే విదంగా 1938 లో సాహిత్య విభాగంలో నోబుల్ బహుమతి వచ్చింది
సామాజిక సేవ: ఈమె కృషి రచనలకు మాత్రమే పరిమితం కాలేదు. పెరల్ బక్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమంళో, స్త్రీల హక్కుల ఉద్యమాలలో కూడ చురుకుగా పాల్గొంది. ఏషియన్ అనాధ ఆలలను అమేరికన్లు దత్తత తీసుకునే ఒక ప్రాజెక్టును ప్రారంబించింది.
సినిమాలు: ఆర్కే నారాయణ్ నవల గైడ్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత , నటుడు అయిన దేవానంద్ సినిమాగా తీసినప్పుడు, దాని ఇంగ్లీష్ వెర్షన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడ చేసింది.
మరణం: పెర్ల్ బక్ తన ఎనబై ఒక్కటో ఏట, 1973 వ సంవత్సరంలో మార్చి 6 న ఊపిరి తిత్తుల కాన్సర్ వ్యాదితో మరణించారు.