This Day in History: 2025-07-18
ఫిష్ వెంకట్ 🔴
(ముంగిలంపల్లి వెంకటేశ్) మరణం.
భారతీయ తెలుగు సినీ నటుడు, శ్రామికుడు.
ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ నటుడు శ్రీహరి ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సినీ దర్శకుడు వీవీ వినాయక్ ఆయన్ను నటుడిగా పరిచయం చేశాడు. ‘ఒకసారి తొడకొట్టు చిన్నా’ వంటి డైలాగ్ ద్వారా గుర్తింపు పొందాడు. ఫిష్ వెంకట్ వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశాడు.
ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు లాంటి పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.