This Day in History: 2025-07-25
భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోది నిలిచాడు.
25 జులై 2025 నాటికి ఎక్కువ కాలం భారత ప్రధానిగా (4,078 రోజులు) పనిచేసిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచాడు.
1964 నుంచి 1977 మధ్య నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా (4,077 రోజులు) ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించాడు.
అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి వ్యక్తిగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నిలవగా, ఆయన తర్వాత ప్రస్తుతం ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచాడు.
కాంగ్రెసేతర పార్టీ నుండి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా మోదీ నిలిచాడు.
స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి ప్రధానమంత్రిగా ఆయన రికార్డ్ కలిగి ఉన్నాడు.
