This Day in History: 1969-06-28
1969 : తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక అన్నదాత ప్రారంభం.
అన్నదాత తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక. తెలుగునాట రైతాంగం సమస్యలకు తగిన పరిష్కారాలను సూచిస్తూ వ్యవసాయ విజ్ఞాన సమాచారంతో వెలువడుతున్న పత్రిక. దీని వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు పాత్రికేయులు చెరుకూరి రామోజీరావు. అన్నదాత తొలి సంచికను అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు జనవరి, 1969లో ఆవిష్కరించాడు. అదే సంవత్సరం జూన్ 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది.
పత్రిక ప్రారంభించినప్పుడు కె.ఎస్.రెడ్డి సంపాదకులు. 1987 నుండి కార్యనిర్వాహక సంపాదకుడుగా డా.వాసిరెడ్డి నారాయణరావు పనిచేస్తున్నాడు.
ప్రతి సంవత్సరం అన్నదాత డయరీని కూడా ప్రచురించి చందాదారులకు అందిస్తున్నారు. ఇందులో రైతాంగానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని ఏడాది పొడుగునా ఉపయోగపడే విధంగా రూపొందిస్తున్నారు.