1941-08-07 – On This Day  

This Day in History: 1941-08-07

1941 : విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం. భారతీయ బెంగాలీ పాలిమత్, కవి, రచయిత, స్వరకర్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త, చిత్రకారుడు. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. భారత జాతీయగీతం ‘జనగణమన’ ను రచించాడు. విశ్వభారతి విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు.గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించాడు. శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు.

రవీంద్రనాథ టాగోర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన “జనగణమణ” ను జాతీయ గీతంగా ప్రకటించేముందు “వందేమాతరం”, “జనగణమన” లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి “జనగణమన” దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.

Share