This Day in History: 1910-08-13
పద్మశ్రీ
రేలంగి 🔴
(రేలంగి వెంకట్రామయ్య)
జననం.
భరతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, దాత. హాస్య బ్రహ్మ, హాస్య నట చక్రవర్తి బిరుదులు పొందాడు. భారతదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.
ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు. 300కి పైగా చిత్రాల్లో నటించాడు. రమణా రెడ్డితో జత కట్టి తెలుగు హాస్య జంటగా పేరు గాంచారు.
తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్రమందిర్ థియేటర్ నిర్మించాడు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా నియమింపబడ్డాడు.
ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. ఆయన ఇంట నిత్యం అన్నదానములు జరిగేవి.
అనేక సన్మానాలు, గౌరవ పురస్కారాలు పొందాడు.