1907-09-28 – On This Day  

This Day in History: 1907-09-28

1907 : షహీద్ భగత్ సింగ్ సంధు జననం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, ఉద్యమకారుడు. నౌజవాన్ భారత్ సభ స్థాపకుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.‘విప్లవం వర్ధిల్లాలి’ అనే నినాదాన్ని ఇచ్చాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు.  ఇప్పటి పాకిస్తాన్ లాహోర్ లో జన్మించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఈయన పుట్టిన రోజును కొంతమంది సెప్టెంబర్ 26, కొంతమంది 27, మరికొంతమంది 28గా పేర్కొంటారు.

Share