This Day in History: 1924-10-28
1924 : సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం (పెద్దిబొట్ల సూర్యకాంతం) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, పరోపకారి. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, గయ్యాళి అత్త, రంగస్థల శిరోమణి, అరుంగలై మామణి బిరుదలు పొందింది. గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది. సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆమెతో ‘సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు’ అంటూ హాస్యం చేశాడు. పేదలకు భోజనం పెట్టేది. అనేక స్వచ్ఛంద సంస్థలకు నిధులను విరాళంగా ఇచ్చింది. మహానటి సావిత్రి మెమోరియల్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు లభించాయి.