This Day in History: 2012-12-11
2012 : భారతరత్న రవి శంకర్ (రబింద్రో శౌంకోర్ చౌదురి) మరణం. భారతీయ సితార వాద్యకారుడు, స్వరకర్త. పండిట్ బిరుదు ఉంది. సితార వాయిద్యంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చాడు. యునెస్కో సంగీత పురస్కారంతో పాటు పద్మవిభూషణ్, కాళిదాస్ సమ్మాన్, రామన్ మెగసేసే, భారతరత్న పురస్కారాలు అందుకున్నాడు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యునిగా వ్యవహరించాడు.