This Day in History: 1940-01-10
1940 : పద్మ విభూషణ్ జేసుదాసు (కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్) జననం. భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, సిని నేపథ్య గాయకుడు. ‘గాన గంధర్వన్’ బిరుదు పొందాడు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడాడు. శబరిమల ఆలయంలో జేసుదాసు పాటనే వినిపిస్తారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, రాష్ట్ర పురస్కారాలు, సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.