1897-01-23 – On This Day  

This Day in History: 1897-01-23

Netaji Subhas Chanda Boseనేతాజీ
సుభాష్ చంద్రబోస్ 🔴

జననం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది.
రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాజకీయ పార్టీ స్థాపించాడు.

సుభాస్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశా రాష్ట్రం, కటక్‌లో జన్మించాడు.

విద్యలో ప్రతిభావంతుడైన బోస్, ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివి ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ, దేశభక్తి కోసం ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.

ఆయన ప్రారంభంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో పనిచేసి, 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

కానీ మహాత్మాగాంధీతో అభిప్రాయ భేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీని వదిలి ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించాడు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సహకారంతో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ (INA)’ ను ఏర్పాటు చేసి, భారత స్వాతంత్ర్య సమరాన్ని సాయుధ పోరాట దిశగా నడిపించాడు.

ఆయన ఇచ్చిన ‘జై హింద్’ నినాదం, ‘నువ్వు నాకు రక్తం ఇస్తే, నేను నీకు స్వేచ్ఛ ఇస్తాను’ అనే పిలుపు భారత ప్రజల్లో అగ్ని జ్వాలలు రేపాయి.

1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారికంగా చెబుతారు, కానీ ఆయన మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు, గాథలు కొనసాగుతున్నాయి.

Share